: పానిపట్టులో కూలిన జాగ్వార్


ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అమ్ములపొదిలోని ఫైటర్ విమానం జాగ్వార్ కూలిపోయింది. రోజు వారీ విధుల్లో భాగంగా విమానం ప్రయాణిస్తుండగా ఇంజిన్ లో సాంకేతిక లోపం తలెత్తడంతో హర్యానా రాష్ట్రంలోని కురుక్షేత్ర జిల్లాలోని షాబాద్ సమీపంలోని చారిత్రక స్థలం పానిపట్టు వద్ద కుప్పకూలింది. విమానంలో ఏర్పడిన సాంకేతిక లోపాన్ని గుర్తించిన పైలట్ ప్యారాచూట్ సాయంతో సురక్షితంగా బయటపడ్డారు. అయితే ల్యాండింగ్ సమయంలో ఆయన గాయపడ్డారు. దీంతో అతనిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News