: భూముల విషయంలో ఏ రైతూ కన్నీరు కార్చడం లేదు: దేవినేని ఉమా


రాజధాని నిర్మాణానికి భూములిచ్చేందుకు ఏ రైతూ కన్నీరు పెట్టడం లేదని ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. రైతులకు సంతృప్తికర స్థాయిలో భూములకు పరిహారం చెల్లిస్తున్నామని చెప్పారు. భూములు కోల్పోయిన రైతులు ఉపాధి పొందేలా ప్రభుత్వం శిక్షణ ఇస్తుందన్నారు. శ్రీశైలంలోని జలాశయం వద్ద కాల్వ పనులను మంత్రి పరిశీలించారు. గోరకల్లు జలాశయం వరకు కాల్వ ద్వారా ప్రయాణించిన ఉమా, గుత్తేదారు పనిచేయకపోతే తొలగించాలని అధికారులకు చెప్పారు. ఈ సమయంలో మంత్రి రాజధాని భూముల విషయంపై పైవిధంగా మాట్లాడారు.

  • Loading...

More Telugu News