: ఐపీఎల్ లో నేటి రసవత్తర పోరు
ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఆరవ సీజన్ రసవత్తరంగా కొనసాగుతోంది. ఇందులో భాగంగా ఈరోజు డిపెండింగ్ ఛాంపియన్ 'కోల్ కతా నైట్ రైడర్స్- చెన్నై సూపర్ కింగ్స్' జట్లు తలపడబోతున్నాయి. కోల్ కతా వేదికగా జరిగే ఈ మ్యాచ్ సాయంకాలం 4 గంటలకు ప్రారంభమవుతుంది. అనంతరం 8 గంటలకు బెంగళూరు వేదికగా 'రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు- రాజస్థాన్ రాయల్స్' జట్లు తలపడనున్నాయి. కాగా, నిన్న రాత్రి ఉప్పల్ వేదికగా 'సన్ రైజర్స్-పంజాబ్' మధ్య జరిగిన పోరులో 5 వికెట్ల నష్టానికి 127 పరుగులు చేసి, హైదరాబాద్ విజయం సాధించింది. దీంతో రైజర్స్ జట్టు పాయింట్ల పట్టికలో ప్రధమస్థానంలో నిలిచింది.