: నెస్ వాడియాకు, నాకు మధ్య జరిగిందంతా ఓ పీడకల: ప్రీతిజింటా


వ్యాపారవేత్త నెస్ వాడియా, బాలీవుడ్ నటి ప్రతిజింటా మధ్య జరిగిన వివాదం, ఆరోపణలు, కేసులు... సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. తాజాగా వాడియాపై మీడియాతో స్పందించిన ప్రీతి, తామిద్దరి మధ్య జరిగిందంతా దురదృష్టకరమైందని చెబుతోంది. తనకు, మాజీ ప్రియుడికి మధ్య వివాదాలు వచ్చినప్పటికీ ఐపీఎల్ లో తన ఫ్రాంఛైజీ నుంచి దూరం కావాలనుకోవడం లేదని తెలిపింది. మరోవైపు ప్రీతి వ్యాఖ్యలపై వాడియా కూడా స్పందించాడని, కానీ ఆమె పెట్టిన కేసుపై మాత్రం కామెంట్ చేసేందుకు తిరస్కరించినట్టు సమాచారం. ఇదిలా ఉంటే తాజాగా ఓ కార్యక్రమంలో వాడియా గురించి ప్రీతిని ఓ జర్నలిస్టు అడగ్గా విసుగుచెందినట్టు తెలిసింది. ప్రతిసారీ ఆ విషయాల గురించి ఎందుకు అడుగుతారని అన్నట్లు వినికిడి.

  • Loading...

More Telugu News