: అన్నమో రామచంద్రా... ఆందోళన బాటలో నూజివీడు ట్రిపుల్ ఐటీ విద్యార్థులు
ట్రిపుల్ ఐటీల్లో విద్యార్థుల ఆకలి కేకలు మరిన్ని ప్రాంతాలకు విస్తరిస్తున్నాయి. ఆదిలాబాద్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు సుదీర్ఘకాలంగా సరైన భోజనం లేక ఇప్పటికే పలుమార్లు రోడ్డెక్కారు. ఎప్పటికప్పుడు సమస్యను తాత్కాలికంగా పరిష్కరిస్తున్న అధికారులు, అక్కడి విద్యార్థుల ఆకలి కేకలకు ఫుల్ స్టాప్ పెట్టడం లేదు. తాజాగా ఈ తరహా ఆకలి కేకలు కృష్ణా జిల్లా నూజివీడులోని ట్రిపుల్ ఐటీలోనూ వినిపించాయి. వేళకు అన్నం పెట్టడం లేదని విద్యార్థులు ఆందోళనకు దిగారు. స్పందించిన తహశీల్దార్ విద్యార్థులకు నచ్చజెప్పి ఆందోళనను విరమింపజేశారు. ఇకపై భోజనం వేళలు పక్కాగా అమలయ్యేలా జాగ్రత్తలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.