: బాధితురాలిపై నిర్భయ నేరస్థుడి వ్యాఖ్యలు మాట్లాడేందుకు వీలుకానివి: ఐరాస
నిర్భయ కేసులో ఓ దోషిగా ఉన్న ముకేశ్ సింగ్ బాధితురాలిని నిందిస్తూ చేసిన వ్యాఖ్యలను ఐక్యరాజ్య సమితి తీవ్రంగా ఖండించింది. దాడికి బాధ్యురాలిని చేస్తూ మాట్లాడటం చెప్పేందుకు వీలుకానిదని ఐరాస సెక్రెటరీ జనరల్ బాన్ కీ మూన్ అధికార ప్రతినిధి స్టీఫెన్ డుజారిక్ అన్నారు. మహిళలపై జరుగుతున్న హింసను పురుషులు అడ్డుకోవాల్సిన సమయం ఆసన్నమైందని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. అయితే ముకేశ్ వ్యాఖ్యలపై మరింత స్పందించేందుకు ఆయన నిరాకరించారు. స్త్రీలపై హింసను అడ్డుకునేందుకు మగవాళ్లు సిద్ధంగా ఉండాలని, గట్టిగా నినదించాలని సూచించారు.