: భూసేకరణ చేస్తే పోరాటం చేస్తా: ఎర్రబాలెం రైతులతో పవన్
ఉండవల్లి గ్రామంలో పర్యటనను ముగించుకున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్... ప్రస్తుతం ఎర్రబాలెం రైతులతో చర్చిస్తున్నారు. ఈ సందర్భంగా, రైతుల సమస్యలను అడిగి మరీ తెలుసుకుంటున్నారు పవన్. ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం ఇచ్చే ప్యాకేజీలకు తాము ఒప్పుకోమని, భూములను ఇవ్వమని ఎర్రబాలెం రైతులు పవన్ కు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, స్వచ్ఛందంగా ముందుకొచ్చే రైతుల నుంచే ప్రభుత్వం భూములను తీసుకోవాలని సూచించారు. బలవంతంగా చేసే భూసేకరణను తాను వ్యతిరేకిస్తానని, బలవంతపు భూసేకరణకు వ్యతిరేకంగా పోరాటం చేస్తానని చెప్పారు. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబులతో రెండు, మూడు రోజుల్లో మాట్లాడతానని వెల్లడించారు.