: వాడి మాటలు అందరూ వినాలి... డాక్యుమెంటరీపై నిషేధం ఎందుకు?: ప్రశ్నించిన నిర్భయ తండ్రి
తన కుమార్తెపై దారుణంగా హత్యాచారం చేసి ఉరిశిక్ష పడి జైలులో ఉన్న ముఖేష్ సింగ్ ఇంటర్వ్యూతో కూడిన 'ఇండియాస్ డాటర్' డాక్యుమెంటరీ ప్రసారంపై ఎందుకు నిషేధం విధించారని నిర్భయ తండ్రి ప్రశ్నించారు. ఈ డాక్యుమెంటరీని ప్రతి ఒక్కరూ చూడాలని, దేశంలోని వ్యక్తుల ఆలోచనా విధానానికి, మహిళలపట్ల పురుషుల నిజానికి అద్దం పట్టేలా ఇది తయారయిందని తెలిపారు. జైలులో ఉన్న వ్యక్తి అలాంటి వ్యాఖ్యలు చేశాడంటే, వాడిని స్వేచ్ఛగా వదిలేస్తే ఇంకేం మాట్లాడతాడో ఊహించుకోవాలని అన్నారు. నేరస్తుల పట్ల ఏ నిర్ణయం తీసుకున్నా, బాధితులు దానిని అంగీకరించడం తప్ప ఏమీ చేయలేని పరిస్థితులు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. 'ఇండియాస్ డాటర్' డాక్యుమెంటరీని బీబీసీకి చెందిన బ్రిటిష్ ఫిల్మ్ మేకర్ లెస్లీ ఉడ్విన్ తీసిన సంగతి తెలిసిందే.