: రెండు వారాల ముందే వేసవి సెలవులు... టీ సర్కారు యోచన


తెలంగాణ రాష్ట్రంలో పాఠశాలలకు వేసవి సెలవుల్ని రెండు వారాల ముందే ప్రకటించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ప్రతి ఏటా ఏప్రిల్ 24 నుంచి సెలవులు ఇస్తున్నట్టు కాకుండా ఈ దఫా ఏప్రిల్ 12 నుంచే సెలవులివ్వాలనే ప్రతిపాదన పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. స్కూల్స్ పునఃప్రారంభ తేదీని జూన్ 12కు బదులు జూన్ 1కి మార్చాలని కూడా భావిస్తున్నట్టు సమాచారం. జూన్ 2న జరిగే తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాల్లో పాఠశాలలు కూడా పాల్గొనాలనే ఉద్దేశంతో ఈ ప్రతిపాదన చేస్తున్నట్టు సమాచారం. ఈ ప్రతిపాదనలపై ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకోవాల్సివుంది. కాగా, ఒకవేళ సెలవులు ముందుకు జరపాల్సి వస్తే వచ్చే ఇబ్బందులపై విద్యాశాఖ వర్గాలు కసరత్తు చేస్తున్నాయి.

  • Loading...

More Telugu News