: రైతు ఇంట్లో భోజనం చేసి, ఒక రోజు గడిపిన మహారాష్ట్ర సీఎం
దేశంలో మహారాష్ట్రలో రైతుల ఆత్మహత్యలు అధికంగా జరుగుతున్నాయన్న విషయం తెలిసిందే. ఏ ప్రభుత్వాలు వచ్చినా రైతుల సమస్యలు తీరకపోవడంతో మరణాలు మాత్రం ఆగడలేదు. తాజాగా రైతుల మరణానికి గల కారణాలను తెలుసుకునేందుకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ మూడు గ్రామాల్లో పర్యటించి పరిస్థితిని సమీక్షించారు. ఈ క్రమంలో విదర్భలోని 'యవత్ మల్' జిల్లా పింప్రి బూటి గ్రామంలో ముందుగా చనిపోయిన రైతుల భార్యలతో సమావేశమై మాట్లాడారు. అనంతరం విష్ణుజీ రంగారవు దుమ్నే అనే స్థానిక రైతు ఇంట్లో భోజనం చేసి, ఆ రోజు రాత్రి అక్కడే సీఎం గడిపారని మహా సర్కారు ఓ ప్రకటన విడుదల చేసింది. ఇదే విషయాన్ని ఫడ్నవిస్ ట్విట్టర్ ఖాతాలో పోస్టుచేసి, రైతు ఇంట్లో భోజనం చేస్తున్నప్పుడు తీసిన ఫొటోలను కూడా ఉంచారు.