: డెడ్ లైన్ల పేరుతో రైతుల భూములు లాక్కోవద్దు... రైతు శోకం రాజధానికి తగులుతుంది: పవన్


రాజధాని ప్రాంత గ్రామాల్లో పర్యటిస్తున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఉండవల్లి గ్రామంలో ప్రసంగించారు. ఈ సందర్భంగా భారీ ఎత్తున పవన్ అభిమానులు, రైతులు సభావేదిక వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ, రైతు కన్నీటితో వచ్చే రాజధాని అవసరం లేదని చెప్పారు. తనకు కూడా గొప్ప రాజధాని రావాలనే కోరిక బలంగా ఉందని... కానీ, రైతు కన్నీరు పెడితే ఆ శోకం రాజధానికి తగులుతుందని అన్నారు. ల్యాండ్ పూలింగ్ నిలిపివేయాలని మంత్రులు నారాయణ, ప్రత్తిపాటిని కోరుతున్నానని చెప్పారు. రైతుల సమస్యలు తెలుసుకునేందుకే వచ్చానని, రైతులకు అండగా ఉంటానని అన్నారు. డెడ్ లైన్లు పెట్టి ఉండవల్లి గ్రామంలోని రైతుల భూములను తీసుకోవద్దని పవన్ సూచించారు.

  • Loading...

More Telugu News