: భద్రత లేకుండా రాజధాని ప్రాంతానికి పవన్... భద్రతపై అభిమానుల ఆగ్రహం
ఈ ఉదయం రాజధాని రైతులతో మాట్లాడేందుకు విజయవాడ చేరుకున్న జనసేన అధ్యక్షుడు, సినీ నటుడు పవన్ కల్యాణ్ కు సరైన భద్రత కల్పించలేదని ఆయన అభిమానులు ఆరోపిస్తున్నారు. విజయవాడ విమానాశ్రయం నుంచి ఉండవల్లి బయలుదేరిన ఆయన వాహనాలకు ఎస్కార్టును కేటాయించలేదని విమర్శించారు. ప్రజలు, అభిమానులు అత్యుత్సాహంతో ఆయనను చుట్టుముడితే పరిస్థితి ఏంటని ఆందోళన వ్యక్తం చేశారు. కాగా, ఉదయం 10 గంటల ప్రాంతంలో ఆయన ఉండవల్లి చేరుకున్నారు.