: మూడు నెలల్లో ఐదోసారి... ఈసారి స్వాములోరితో కలిసిన కేసీఆర్


మూడు నెలల వ్యవధిలో ఐదోసారి యాదగిరిగుట్టకు కేసీఆర్ పయనమయ్యారు. ఈ దఫా త్రిదండి రామానుజ చిన్నజీయర్‌ స్వామిని కొండకు తీసుకురానున్నారు. శ్రీలక్ష్మీనరసింహస్వామి గర్భాలయం, ఆంజనేయస్వామి ఆలయాల వద్ద కొత్త నిర్మాణాలు, మార్పు చేర్పులపై ఆయన సలహాలు తీసుకునేందుకు ఈ ఉదయం 11.30 గంటలకు హెలికాప్టర్‌ లో గుట్టకు వెళ్తున్నారు. శ్రీవైష్ణవ ఆలయాల్లో కొత్త నిర్మాణాలు చేపట్టాలంటే ఆగమశాస్త్రానుసారం సలహాలు తీసుకొని ముందుకు వెళ్ళడం తప్పనిసరి. ఈ నేపథ్యంలో నిర్మాణాలు చేపట్టిన తరువాత విమర్శలు ఎదుర్కోవడం కన్నా, ముందే సలహాలు పొందడం మంచిదని భావిస్తున్న ఆయన చిన్నజీయర్‌ స్వామి సలహాలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News