: పాక్ ను పొగిడితే చెప్పుతో కొట్టాలి... ఈసారి సాధ్వీ సరస్వతి వంతు


ఇండియాలో నివసిస్తూ పాకిస్తాన్ ను పొగిడేవాళ్లను చెప్పుతో కొట్టాలని వీహెచ్పీ నేత సాధ్వి బాలికా సరస్వతీ వ్యాఖ్యానించారు. పాక్ ను పొగిడేవారిని ఆ దేశానికే తరిమి తరిమి కొట్టాలని, ఇటువంటి వ్యాఖ్యలను ఎంతమాత్రం సహించరాదని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మంగళూరులో జరిగిన హిందూ సమాజోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఆమె ప్రసంగిస్తూ, భారత్ లో ఉంటూ, ఇక్కడ పండుతున్న తిండి తింటూ పరాయి దేశాన్ని పొగిడేవాళ్లను కొట్టి తరమాలని ఉద్బోధించారు. ఇటువంటి వాళ్ళను దెబ్బకు దెబ్బకు తీయాల్సిందేనని అన్నారు. అయోధ్యలో శ్రీరాముడికి గుడి కట్టాలని, ఇస్లామాబాదులో కూడా రామమందిరం నిర్మించి అక్కడకు వెళ్లి పూజలు నిర్వహించాలంటూ పిలుపునిచ్చారు. మనమంతా ఆయుధాలు పట్టుకోవాల్సిన సమయం వచ్చిందని అన్నారు.

  • Loading...

More Telugu News