: గజరాజు బీభత్సం... బీహార్ లో ఆరుగురు మృత్యువాత, నలుగురి పరిస్థితి విషమం


ఏపీలోని చిత్తూరు జిల్లాలో నిత్యం ఏనుగుల సంచారంతో కుప్పం నియోజకవర్గ ప్రజలు దినదినగండంగా కాలం వెళ్లదీస్తున్నారు. బీహార్ లోని మధుబన్ జిల్లా సీతంహారీ గ్రామంలో నిన్న ఓ గజరాజు బీభత్సం సృష్టించింది. నేపాల్ అటవీ ప్రాంతం నుంచి వచ్చిందని భావిస్తున్న సదరు ఏనుగు, గ్రామ శివారులో పొలం పనుల్లో నిమగ్నమైన వారిపై విరుచుకుపడింది. భయంతో పరుగులు పెట్టిన వారిని పట్టుకుని మరీ కాళ్ల కింద వేసి తొక్కేసింది. ఈ ఘటనలో ఆరుగురు అక్కడికక్కడే చనిపోగా, తీవ్రంగా గాయపడిన మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. ఇక ఏనుగు బారి నుంచి గ్రామస్తులను రక్షించేందుకు యత్నించిన పోలీసు శాఖకు చెందిన ఓ డ్రైవర్ కూడా ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై బీహార్ సీఎం నితీశ్ కుమార్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News