: స్పెక్ట్రం వేలానికి పోటెత్తిన బిడ్లు... తొలి రోజే రూ. 60 వేల కోట్ల విలువైన టెండర్లు!
దేశంలో 2జీ, 3జీ నెట్ వర్క్ వేలానికి కార్పొరేట్ల నుంచి తొలి రోజే అనూహ్య స్పందన లభించింది. 2జీ స్కాం నేపథ్యంలో సుదీర్ఘ కాలం తర్వాత జరుగుతున్న స్పెక్ట్రం వేలానికి కార్పొరేట్లు క్యూ కడతాయని ముందే ఊహించినా, అంచనాలకు మించి స్పందన లభించిందని టెలికాం వర్గాలు చెబుతున్నాయి. నిన్న ప్రారంభమైన వేలానికి సంబంధించి రూ.60 వేల విలువ చేసే బిడ్లు దాఖలయ్యాయి. నేడు కూడా బిడ్లను స్వీకరిస్తారు. ఈ దఫా వేలంలో రూ. 82 వేల కోట్ల మేర ఆదాయం ఖజానాకు అందుతుందని ప్రభుత్వ వర్గాల అంచనా. అయితే నిన్న కొనసాగిన జోరు నేడు కూడా నమోదైతే, అంచనా కంటే అధికంగానే రాబడి వస్తుందని కూడా ఆ వర్గాలు లెక్కలేస్తున్నాయి.