: భాగ్యనగరి సిగలో మరో కీర్తి కుసుమం... జీవన ప్రమాణాల్లో దేశంలో హైదరాబాదు అత్యుత్తమ నగరం
హైదరాబాదు నగరం మరో అరుదైన ఘనతను సాధించింది. జీవన ప్రమాణాల్లో దేశంలోనే అత్యుత్తమ నగరంగా ఎంపికైంది. దేశంలోని నాలుగు మెట్రో నగరాలు ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్ కతా ల కంటే మెరుగైన జీవన ప్రమాణాలకు హైదరాబాదు కేంద్రంగా ఉందని ప్రపంచ సర్వే సంస్థ ‘మెర్సర్’ తేల్చింది. అంతేకాక హైదరాబాదు నగరంపై సదరు సంస్థ ప్రశంసల వర్షం కురిపించింది. ప్రపంచంలోని నగరాల జాబితాలో 138వ స్థానాన్ని కైవసం చేసుకున్న హైదరాబాదు, దేశంలోని మిగతా నగరాలన్నింటికంటే మెరుగైన స్థానంలో నిలిచింది. అంతర్జాతీయ విద్యా ప్రమాణాలున్న విద్యా సంస్థలకు ఆలవాలమైన హైదరాబాదుకు శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు మరో వరంలా మారింది. ఇవే అంశాలను ప్రస్తావించిన మెర్సర్ నివేదిక, దేశంలోని నగరాల కంటే హైదరాబాదులోనే జీవన ప్రమాణాలు మెరుగ్గా ఉన్నాయని ప్రకటించింది.