: కోహ్లీపై ఐసీసీ, బీసీసీఐలకు ఫిర్యాదు చేసిన స్పోర్ట్స్ జర్నలిస్ట్!


మీడియా ప్రతినిధిపై నోరు పారేసుకుని విమర్శల జడివాన ఎదుర్కొంటున్న టీమిండియా వైస్ కెప్టెన్ విరాట్ కోహ్లీ, మరింత మేర కష్టాలను ఎదుర్కోక తప్పదని తెలుస్తోంది. తనను అకారణంగా దూషించిన కోహ్లీపై సదరు స్పోర్ట్స్ జర్నలిస్ట్ బీసీసీఐతో పాటు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)కి కూడా ఫిర్యాదు చేశారు. కోహ్లీ దురుసు వర్తన నేపథ్యంలో నెలకొన్న వివాదానికి తెరదించేందుకు టీడిండియా మేనేజ్ మెంట్ చేసిన యత్నాలేవీ ఫలించలేదట. కోహ్లీతో రాజీకి రావాలన్న మేనేజ్ మెంట్ వినతిని హిందూస్థాన్ టైమ్స్ జర్నలిస్ట్ జస్విందర్ సిద్దూ తిరస్కరించారట. అంతేకాక నోటి దురుసుతో తనను మానసిక వేదనకు గురి చేసిన కోహ్లీపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కూడా ఆయన బీసీసీఐ, ఐసీసీలకు ఫిర్యాదు చేశారు.

  • Loading...

More Telugu News