: బ్యాంకుకు టోకరా వేసిన మందుబాబు!
రంగారెడ్డి జిల్లా వికారాబాద్ పట్టణంలోని ఓ బ్యాంకుకు ఆలంపల్లికి చెందిన లంక లక్ష్మారెడ్డి నగదు డ్రా చేసుకునేందుకు వెళ్లాడు. క్యూలో నిల్చున్న ఆయన మరో అత్యవసర పని ఉండడంతో పాస్ బుక్ ను కౌంటర్ లో ఇచ్చి ఇంటికెళ్లాడు. ఓ గంట తరువాత తన ఖాతా నుంచి 18 వేల రూపాయలు విత్ డ్రా అయినట్టు సమాచారం వచ్చింది. దీంతో బ్యాంకు మేనేజర్ కు ఫిర్యాదు చేశాడు. దీంతో బ్యాంకు మేనేజర్ వోచర్ పరిశీలించగా అందులో దొంగ సంతకంతో నగదు డ్రా చేసినట్టు తేలింది. దీంతో సీసీ పుటేజీని పరిశీలించారు. కౌంటర్ మీద ఉన్న పాస్ బుక్ ను జాగ్రత్తగా తీసుకుని, 18 వేలు డ్రా చేసి ఎబ్బనూరుకు చెందిన బ్యాగరి లక్ష్మణ్ వెళ్లిపోయాడు. దీంతో అతనికి ఫోన్ చేశారు. తాను అనంతగిరి గుట్టపై బిజీగా ఉన్నానని, ప్రస్తుతం మందుకొడుతున్నానని, తరువాత ఫోన్ చేయండని పెట్టేశాడు. దీంతో అవాక్కైన బ్యాంకు అధికారులు, అతనిపై ఫిర్యాదు చేయనున్నారు.