: ప్రపంచకప్ లో ప్రస్తుతానికి అనామకుడే హీరో
ప్రపంచ కప్ లో పరుగుల వేట వేగం పుంజుకుంది. స్టార్ బ్యాట్స్ మెన్ తో పోటీపడుతూ అనామక ఆటగాళ్లు పరుగులు వరద పారిస్తున్నారు. విధ్వంసక వీరులకు ఏమాత్రం తీసిపోమంటూ వెటరన్లు సెంచరీలు బాదుతున్నారు. ప్రపంచ కప్ లో ఇప్పటి వరకు అత్యధిక పరుగులు సాధించిన టాప్-10 బ్యాట్స్మెన్ లో అగ్రశ్రేణి జట్లు, పసికూనల ఆటగాళ్లు ఉండటం విశేషం. వ్యక్తిగత అత్యధిక పరుగుల వేటలో అందరి కంటే ముందుండి హీరో అనిపించుకుంటున్నాడు యూఏఈకి చెందిన అనామక ఆటగాడు షైమన్ అన్వర్. సెంచరీ సహా 270 పరుగులు చేసి అత్యధిక పరుగుల వీరుడిగా నిలిచాడు. అతని తరువాతి స్థానాల్లో సంగక్కర రెండు సెంచరీలతో 268 పరుగులు చేస్తే, గేల్ ఒక్క డబుల్ సెంచరీతో 258 పరుగులు చేశాడు. హషీమ్ ఆమ్లా(257), తిరుమన్నే (256), డుప్లెసిస్ (250), డివిలీర్స్ (241), వార్నర్ (234) దిల్షాన్ (229) మిల్లర్ (226), శిఖర్ ధావన్ (224), బ్రెండన్ మెక్ కల్లమ్ (207) టాప్ స్కోరర్లుగా నిలిచారు.