: ప్రత్యేక హైకోర్టు కోసం ప్రభుత్వం కృషి చేస్తోంది: ఇంద్రకరణ్ రెడ్డి


తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక హైకోర్టు కోసం ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోందని న్యాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి చెప్పారు. హైకోర్టు ప్రాముఖ్యతను సీఎం కేసీఆర్ ఇప్పటికే గవర్నర్ దృష్టికి తీసుకువెళ్లారని అన్నారు. అటు తెలంగాణ ప్రభుత్వం కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించిందని వివరించారు. ప్రత్యేక కోర్టు కోసం ఆందోళన చేస్తున్న టి.న్యాయవాదుల సంఘం మంత్రితో సమావేశమై చర్చించింది. జూనియర్ సివిల్ జడ్జిల నియామకాలు జరిగితే తెలంగాణకు అన్యాయం జరుగుతుందని మంత్రికి వివరించారు. ఈ సందర్భంగానే మంత్రి పైవిధంగా మాట్లాడారు.

  • Loading...

More Telugu News