: బద్దలైన భారత ప్రపంచ రికార్డు... ప్రపంచ కప్ లో అత్యధిక పరుగులు చేసిన ఆసీస్


ప్రపంచ కప్ లో భారత్ పేరిట ఉన్న అత్యధిక పరుగుల రికార్డు బద్దలైంది. పెర్త్ లో జరుగుతున్న మ్యాచ్ లో పసికూన ఆఫ్ఘనిస్థాన్ పై ఆస్ట్రేలియా బ్యాట్స్ మెన్ నిర్దాక్ష్యిణ్యంగా విరుచుకుపడి ఏకంగా 417 పరుగులు చేశారు. దీంతో ఇప్పటి వరకు భారత్ పేరిట ఉన్న 413 పరుగుల రికార్డు బద్దలైంది. ఎనిమిదేళ్ల పాటు భారత్ పేరు మీదున్న హైయ్యెస్ట్ స్కోర్ రికార్డు నేటితో ఆసీస్ సొంతమైంది. 2007 ప్రపంచకప్ లో బెర్ముడాపై భారత్ 5 వికెట్ల నష్టానికి 413 పరుగులు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్, ఆదిలోనే ఫించ్ వికెట్ కోల్పోయినప్పటకీ... మిగిలిన బ్యాట్స్ మెన్ తగ్గలేదు. ఆఫ్ఘన్ బౌలర్లను ఊచకోత కోశారు. ఈ క్రమంలో వార్నర్ 178 (133), స్మిత్ 95 (98), మ్యాక్స్ వెల్ 88 (39 బంతులు, 7 సిక్సర్లు, 6 ఫోర్లు) పరుగులతో కదం తొక్కారు. ఈ క్రమంలో, నిర్ణీత 50 ఓవర్లలో ఆసీస్ 6 వికెట్లు కోల్పోయి 417 పరుగులు చేసింది. దీంతో, భారత్ రికార్డు కనుమరుగైంది. ప్రస్తుతం ఆఫ్ఘన్ ముందు 418 పరుగుల విజయలక్ష్యం ఉంది.

  • Loading...

More Telugu News