: పాకిస్థాన్ ఆశలు సజీవం... మలిపోరుపై ఆసక్తి


ప్రపంచ కప్ లో తొలి రెండు మ్యాచ్ లలో చిత్తుగా ఓడిపోయి అభాసుపాలైన పాకిస్థాన్... చిన్న జట్లపై విజయం సాధిస్తోంది. జింబాబ్వేపై అతికష్టం మీద నెగ్గి బోణీ కొట్టిన పాక్... పసికూన యూఏఈపై ప్రతాపం చూపించింది. 129 పరుగులతో యూఏఈపై విజయం సాధించి నాకౌట్ ఆశల్ని సజీవంగా ఉంచుకుంది. నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 339 పరుగులు చేసిన పాక్ బౌలింగ్ దాడిని యూఏఈ తట్టుకోలేకపోయింది. దీంతో నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 210 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ ప్రపంచకప్ లో పాక్ జట్టు 300 స్కోరు దాటడం ఇదే ప్రథమం. పాక్ జట్టులో షెహజాద్ (93), హారిస్ సొహైల్ (70) అర్ధ సెంచరీలతో రాణించగా, కెప్టెన్ మిస్బా (65) మెరుపులు మెరిపించాడు. యూఏఈ జట్టులో సైమన్ (62), ఖుర్రం ఖాన్ (43) అంజాద్ (40), స్వప్నిల్ పాటిల్ (36) రాణించారు.

  • Loading...

More Telugu News