: మంత్రులే బెదిరిస్తున్నారు: కిషన్ రెడ్డి
గత రెండేళ్ల నుంచి ఫీజు రీయింబర్స్ మెంట్ చెల్లించడం లేదని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆరోపించారు. ఈ విషయానికి సంబంధించి, ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలను రాష్ట్ర మంత్రులే బెదిరిస్తున్నారని మండిపడ్డారు. కోర్టు ఇచ్చిన ఆర్డర్స్ ను కూడా ప్రభుత్వం బేఖాతరు చేసిందని అన్నారు. ఆస్తి పన్ను పెంపును నిరసిస్తూ ఇందిరాపార్కు వద్ద ఈ రోజు బీజేపీ ఎమ్మెల్యేలు ఒక రోజు దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ, ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే ప్రభుత్వానికి ప్రజలు షాక్ ఇస్తారని హెచ్చరించారు. కాలయాపన చేయకుండా నిర్ణయాలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని సూచించారు.