: ఏపీ సెక్రటేరియట్ ముట్టడికి తెలంగాణ లాయర్ల యత్నం... అరెస్ట్ చేసిన పోలీసులు
హైకోర్టును విభజించి తెలంగాణకు ప్రత్యేక హైకోర్టును ఏర్పాటు చేయాలన్న డిమాండ్ తో ఆందోళన కొనసాగిస్తున్న తెలంగాణ లాయర్లు నేడు ఏపీ సచివాలయాన్ని ముట్టడించేందుకు యత్నించారు. లాయర్ల నిరసనపై ముందే సమాచారం అందుకున్న పోలీసులు సెక్రటేరియట్ ముందు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. అయినా పోలీసు వలయాన్ని ఛేదించుకుని సచివాలయంలోకి వెళ్లేందుకు తెలంగాణ న్యాయవాదులు యత్నించారు. దీంతో రంగప్రవేశం చేసిన పోలీసులు లాయర్లను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా ఇరువర్గాల మధ్య తోపులాట చోటుచేసుకుంది. దీంతో సచివాలయం పరిసరాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.