: ట్విట్టర్ లో ధోనీ కూతురు జివా ఫస్ట్ ఫొటో
టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కూతురు జివా ఫొటో ట్విట్టర్ లోకి వచ్చేసింది. ధోనీ భార్య సాక్షి సింగ్ ధోనీ సదరు ఫొటోను ట్విట్టర్ లో పెట్టింది. అయితే సదరు ఫొటోలో జివా చేతి వేళ్లు మాత్రమే కనిపిస్తున్నాయి. తన వేలిని పట్టుకున్న జివా చేతిని సాక్షి ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. గత నెల 6న గుర్గావ్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో జివా జన్మించిన సంగతి తెలిసిందే. అంతకుముందే ఆస్ట్రేలియా వెళ్లిన ధోనీ, కూతురుని చూసేందుకు రాలేదు. కూతురు కంటే వరల్డ్ కప్ టోర్నీకే ప్రాధాన్యమిస్తానని ప్రకటించిన ధోనీ, మెగా టోర్నీ ముగిసిన తర్వాత కాని భారత్ రానని పేర్కొన్నాడు.