: ఆప్ కన్వీనర్ పదవికి కేజ్రీవాల్ రాజీనామా... జాతీయ కౌన్సిల్ కు రాజీనామా లేఖ


ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ పదవికి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన పార్టీ జాతీయ కౌన్సిల్ కు తన రాజీనామా లేఖను సమర్పించారు. పార్టీలో కేజ్రీవాల్ జోడు పదవులపై కొంతమంది నేతలు నిరసన గళమెత్తారు. మొన్నటిదాకా పార్టీ కన్వీనర్ గా ఉన్న కేజ్రీవాల్, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఘన విజయంతో సీఎం పీఠాన్ని కూడా అధిష్టించారు. ఈ క్రమంలో పార్టీ సిద్ధాంతాల ప్రకారం ఒకే వ్యక్తి రెండు పదవుల్లో కొనసాగడం కుదరదని పార్టీ సీనియర్ నేత యోగేంద్ర యాదవ్ లాంటి కొందరు బాహాటంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఇదివరకే కన్వీనర్ పదవికి కేజ్రీవాల్ రాజీనామా చేసినట్లు పుకార్లు షికారు చేసిన సంగతి తెలిసిందే. పార్టీలో నెలకొన్న సందిగ్ధతను పటాపంచలు చేస్తూ కేజ్రీవాల్ కన్వీనర్ పదవికి కొద్దిసేపటి క్రితం రాజీనామా చేశారు.

  • Loading...

More Telugu News