: తప్పు చేస్తే ఎలాంటి శిక్షకైనా సిద్ధమే: ఆప్ నేత యోగేంద్ర యాదవ్


ఆప్ జాతీయ కన్వీనర్ హోదా నుంచి ఢిల్లీ ముఖ్యమంత్రిని తొలగించేందుకు... ఆ పార్టీ సీనియర్ నేతలు ప్రశాంత్ భూషన్, యోగేంద్ర యాదవ్ లు కుట్రలకు పాల్పడుతున్నారనే వార్తలు సంచలనం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో, యోగేంద్ర యాదవ్ స్పందించారు. వీరిద్దరి వ్యవహారంపై కేజ్రీవాల్ కూడా అసహనం వ్యక్తం చేస్తూ, ఇదంతా రోత పుట్టించే వ్యవహారమంటూ మండిపడ్డారు. ఈ నేపథ్యంలో, వీరిద్దరినీ పార్టీ కమిటీల నుంచి తప్పిస్తారనే వార్తలు వెలువడుతున్నాయి. దీనిపై యాదవ్ స్పందిస్తూ, తాను తప్పు చేయలేదని... ఒక వేళ తాను తప్పు చేస్తే పార్టీ తీసుకునే ఎలాంటి క్రమశిక్షణా చర్యలకైనా సిద్ధమని చెప్పారు. ఈ సాయంత్రంలోగా ఓ వార్త వెలువడుతుందని భావిస్తున్నానని చెప్పారు.

  • Loading...

More Telugu News