: ఎస్పీవై, జూపూడిలను ఎందుకు కొన్నారో?... చంద్రబాబుపై కర్నె ఫైర్
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడుపై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ ఫైరయ్యారు. టీడీపీ నేతలను తాము కొనుగోలు చేస్తున్నామన్న చంద్రబాబు... వైసీపీ నేతలు ఎస్పీవై రెడ్డి, జూపూడి ప్రభాకర్ రావులను ఎందుకు కొన్నారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. హైదరాబాదును విశ్వనగరంగా తీర్చిదిద్దిన ఘనత తనదేనని చెప్పుకుంటున్న చంద్రబాబు, అసలు నగరాభివృద్ధికి చేసిందేమీ లేదని కర్నె కొద్దిసేపటి క్రితం వ్యాఖ్యానించారు. హైదరాబాదును గుడిసెల నగరంగా మార్చింది చంద్రబాబేనని కూడా ఆరోపించారు. వ్యవసాయం దండగన్న బాబు, ఇప్పుడు వ్యవసాయంపై మాట్లాడటం విడ్డూరంగా ఉందని ఆయన ధ్వజమెత్తారు.