: హైదరాబాదులో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ఆత్మహత్య
హైదరాబాదులో మరో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ఆత్మహత్య చేసుకున్నాడు. వేగంగా వస్తున్న రైలుకు ఎదురు వెళ్లి తనువు చాలించాడు. ఈ విషాద ఘటన చందానగర్, లింగంపల్లి రైల్వే స్టేషన్ల మధ్య చోటు చేసుకుంది. మృతుడి వద్ద ఉన్న ఐడీకార్డు, ఫోన్ నంబర్ల ఆధారంగా అతను పని చేస్తున్న కంపెనీకి పోలీసులు సమాచారం అందించారు. మృతుడు కొండా వెంకటరెడ్డి (30) గచ్చిబౌలి లోని డీఎస్ టీ వరల్డ్ కంపెనీలో పనిచేస్తున్నాడు. మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలానికి చెందిన వెంకటరెడ్డికి రెండేళ్ల క్రితం వివాహమయింది. వీరు మణికొండలో నివాసం ఉంటున్నారు. వెంకటరెడ్డికి ఎలాంటి ఆర్థిక సమస్యలు లేవని, అందరితో సరదాగా ఉండేవాడని... ఎందుకు ఆత్మహత్యకు పాల్పడ్డాడో అర్థం కావటం లేదని తోటి ఉద్యోగులు తెలిపారు.