: యాపిల్... స్మార్ట్ ఫోన్ విక్రయాల్లో ‘టాప్’ లేపింది!


స్మార్ట్ ఫోన్ విక్రయాల్లో శాంసంగ్ ఆధిపత్యానికి తెరపడింది. మూడేళ్లుగా ఈ రంగంలో అగ్రస్థానంలో కొనసాగుతున్న శాంసంగ్ జోరుకు ‘ఐఫోన్’ మేకర్ యాపిల్ చెక్ పెట్టింది. 2014-15 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి నాలుగో త్రైమాసికంలో శాంసంగ్ కంటే అధికంగా స్మార్ట్ ఫోన్లను విక్రయించిన యాపిల్, అగ్రస్ధానానికి ఎగబాకింది. నాలుగో త్రైమాసికంలో శాంసంగ్ 7.3 కోట్ల యూనిట్లను ఎగుమతి చేయగా, యాపిల్ 7.4 కోట్ల యూనిట్లు అమ్మేసింది. దీంతో నాలుగో క్వార్టర్ లో స్మార్ట్ ఫోన్ విక్రయాల్లో యాపిల్ 20.4 శాతం వాటాను చేజిక్కించుకోగా, శాంసంగ్ 19.9 శాతానికి పరిమితమైంది. అయితే ఏడాది మొత్తాన్ని పరిగణనలోకి తీసుకుంటే మాత్రం శాంసంగ్ దే అగ్రస్థానమని గార్ట్ నర్ వెల్లడించింది.

  • Loading...

More Telugu News