: మరో ఘనత సాధించిన పాక్ లెజెండరీ క్రికెటర్
ప్రపంచానికి పాకిస్థాన్ అందించిన అద్భుత ఆల్ రౌండర్లలో షాహిది ఆఫ్రిదీ కూడా ఒక్కడు. అటు బ్యాట్ తో లేదా ఇటు బాల్ తో... ఎన్నో అద్భుతాలు చేశాడు ఆఫ్రిదీ. ఎన్నో మ్యాచ్ లను ఒంటి చేత్తో గెలిపించిన షాహిద్ ఆఫ్రిదీ ఈ రోజు మరో ఘనతను సాధించాడు. ప్రపంచకప్ లో భాగంగా యూఏఈతో జరుగుతున్న మ్యాచ్ లో... వన్డేల్లో 8 వేల పరుగులను పూర్తిచేసుకున్నాడు. వ్యక్తిగత స్కోరు 2 పరుగులకు చేరుకోగానే, ఆఫ్రిదీ 8 వేల క్లబ్ లో చేరిపోయాడు. ఇప్పటి వరకు 394 వన్డేలు ఆడిన ఆఫ్రిదీ మొత్తం మీద 8019 పరుగులు చేశాడు. ఇందులో 39 అర్ధ సెంచరీలు, 6 సెంచరీలు ఉన్నాయి. అంతేకాదు, వన్డేల్లో ఇప్పటి వరకు 393 వికెట్లు కూడా పడగొట్టాడు.