: డప్పుకొట్టి డాన్సు చేసిన చంద్రబాబు
తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో రంగుల పండగ హోలీ వేడుకలు వైభవంగా ప్రారంభం అయ్యాయి. ఈ ఉదయం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంట్లో వేడుకలు జరుగగా, ఆయన ఉత్సాహంగా పాల్గొన్నారు. గిరిజన మహిళలతో కలసి హోలీ ఆడి డప్పు కొట్టారు. రంగులు పూసుకుంటూ సంప్రదాయ గిరిజన డాన్సు చేశారు. లయబద్ధమైన డప్పు నృత్యానికి చంద్రబాబు పదం కలపగా, తెలుగు తమ్ముళ్ళ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ కార్యక్రమంలో రమేష్ రాథోడ్ తో పాటు పలువురు నేతలు, కార్యకర్తలు పాల్గొని ఉత్సాహంగా నృత్యాలు చేశారు.