: ఇక భారత్, పాక్ జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్ లు... దాల్మియాతో భేటీ కానున్న షహర్యార్


భారత్, పాక్ జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్ లు మళ్లీ మొదలుకానున్నాయి. ఈ మేరకు బీసీసీఐ కొత్త చీఫ్ గా బాధ్యతలు చేపట్టిన జగ్ మోహన్ దాల్మియాతో భేటీకి పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ షహర్యార్ ఖాన్ రంగం సిద్ధం చేసుకుంటున్నారు. 2004లో పాక్ లో భారత్ పర్యటించిన సందర్భంగా బీసీసీఐకి చైర్మన్ గా దాల్మియా, పీసీబీ చైర్మన్ గా షహర్యార్ ఖాన్ లున్న సంగతి తెలిసిందే. నాడు వారిద్దరి మధ్య మంచి దోస్తీ ఉండేది. తాజాగా దాల్మియా బీసీసీఐ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టడంతో నాటి స్నేహాన్ని కొనసాగించేందుకు షహర్యార్ నిర్ణయించుకున్నారు. ఈ వారాంతంలో దాల్మియాతో షహర్యార్ భేటీ కానున్నారు. భేటీలో భాగంగా ఇరు జట్ల మధ్య 2015-23 మధ్య కాలంలో జరగనున్న ద్వైపాక్షిక సిరీస్ లకు సంబంధించిన షెడ్యూల్ ఖరారు కానున్నట్లు షహర్యార్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

  • Loading...

More Telugu News