: బుల్ 'రంకె'!
వడ్డీ రేట్లను తగ్గిస్తూ ఆర్బీఐ తీసుకున్న నిర్ణయం స్టాక్ మార్కెట్ వర్గాలకు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. కొత్త పెట్టుబడులు వెల్లువెత్తడంతో, మార్కెట్ బుల్ రంకె వేసింది. బుధవారం నాటి సెషన్ ఆరంభంలోనే బొంబాయి స్టాక్ మార్కెట్ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్ 300 పాయింట్లకు పైగా లాభపడి 30 వేల పాయింట్ల మైలురాయిని దాటింది. మరోవైపు నిఫ్టీ సైతం 80 పాయింట్లకు పైగా లాభపడింది. ముఖ్యంగా బ్యాంకింగ్ సెక్టార్ లోని కంపెనీలన్నీ లాభాల్లో కొనసాగుతున్నాయి. ఉదయం 9:30 గంటల సమయంలో ఎస్బీఐ, ఐసీఐసీఐ, యాక్సిస్, హెచ్ డీఎఫ్ సీ తదితర బ్యాంకులతో పాటు టీసీఎస్, మారుతి, ఎల్ అండ్ టి, భారతీ ఎయిర్ టెల్ సంస్థల వాటాలు లాభాల్లో నిలిచాయి.