: ఆమరణ దీక్షతో విషమించిన కమలాపురం ఎంఎల్ఏ రవీంద్రనాథ్ రెడ్డి ఆరోగ్యం
నాలుగు రోజులుగా ఆమరణ నిరాహారదీక్ష చేస్తున్న వైకాపా అధినేత జగన్ మేనమామ, కమాలాపురం ఎమ్మెల్యే పోచంరెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి ఆరోగ్యం మరింతగా క్షీణించింది. గాలేరు-నగరి సుజల స్రవంతి (జీఎన్ఎస్ఎస్) ప్రాజెక్టును తక్షణం పూర్తి చేసి తాగు, సాగు నీరు అందించాలనే డిమాండ్ తో ఆయన వీరపునాయుని పల్లెలో ఆదివారం నిరవధిక దీక్ష మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. ఆయనకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు రక్తంలో చక్కర స్థాయి, బ్లడ్ ప్రెజర్ పడిపోతున్నాయని చెప్పారు. కాగా, రవీంద్రనాథ్ రెడ్డిని పలువురు నేతలు పరామర్శించారు.