: మోదీ సలహాను పాటిస్తున్న కేజ్రీవాల్... సిసోడియాకు పాలన అప్పగించి బెంగళూరుకు!


ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఓ పది రోజుల పాటు ఢిల్లీ పాలన పగ్గాలను పూర్తి స్థాయిలో పర్యవేక్షించనున్నారు. ఎందుకంటే, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఓ పది రోజుల పాటు బెంగళూరుకు వెళుతున్నారట. దగ్గుతో తీవ్రంగా ఇబ్బందిపడుతున్న ఆయన అక్కడి ఓ నేచురోపతి వైద్యుడి వద్ద చికిత్స తీసుకునేందుకు పయనమవుతున్నారు. ఢిల్లీలో వైద్యులు లేరా అంటే, సదరు వైద్యుడి వద్దే చికిత్స తీసుకోమని ఏకంగా ప్రధాని నరేంద్ర మోదీ సలహా ఇచ్చారు. అంతేకాదు, కేజ్రీవాల్ ఎదుటే సదరు బెంగళూరు నేచురోపతి వైద్యుడికి ఫోన్ చేసి, మంచి చికిత్స అందించాలని మరీ సిఫారసు చేశారు. ప్రధాని సలహాను పాటించకపోవడం మంచిది కాదుగా. అందులోనూ సదరు దగ్గు తరచూ ఇబ్బంది పెడుతూనే ఉంది. దీంతో ఇక బెంగళూరు వెళ్లాల్సిందేనని కేజ్రీ నిర్ణయించుకున్నారట. అయితే ఎప్పుడు బయలుదేరతారన్న విషయం ఇంకా ఖరారు కాలేదు.

  • Loading...

More Telugu News