: ‘చవక’ నగరాల్లో బెంగళూరుకు అగ్రస్థానం... ఖరీదైన నగరం సింగపూరేనట!


ప్రపంచంలోని నగరాల్లో బెంగళూరులోనే అతి తక్కువ వ్యయంతో జీవించవచ్చట. ప్రపంచంలోని వివిధ నగరాల్లో జీవన వ్యయంపై ఎకనమిక్ ఇంటెలిజెన్స్ యూనిట్ (ఈఐయూ)రూపొందించిన జాబితాలో బెంగళూరుకు చివరి స్థానం దక్కింది. అంటే, ప్రపంచంలోని అన్ని నగరాల్లోకెల్లా బెంగళూరులో అతి తక్కువ వ్యయంతోనే సుఖంగా కాలం వెళ్లదీయొచ్చు. ఇక బెంగళూరు తర్వాతి స్థానంలో పాకిస్థాన్ వాణిజ్య రాజధాని కరాచీ నిలవగా, ఆ తర్వాతి స్థానాల్లో భారత వాణిజ్య రాజధాని ముబై, తీర ప్రాంత నగరం చెన్నై, న్యూఢిల్లీలు ఉన్నాయి. భారత ఉపఖండం నగరాల్లో తక్కువ ఖర్చుతోనే జీవనం సాగించవచ్చని సదరు నివేదిక వెల్లడించింది. ఇక జీవన వ్యయం అత్యంత ఎక్కువగా ఉన్న నగరాల్లో ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా సింగపూర్ అగ్రస్థానంలో నిలిచింది. ప్యారిస్, ఓస్లో, జూరిచ్, సిడ్నీలు ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. అమెరికా వాణిజ్య రాజధాని న్యూయార్క్ జీవన వ్యయం ప్రాతిపదికగా ఈ నివేదిక తయారైంది.

  • Loading...

More Telugu News