: పెద్దల సభలో మోదీ సర్కారుకు ఝలక్...ధన్యవాద తీర్మానానికి అనుకూలంగా 57 ఓట్లే!
లోక్ సభలో బీజేపీకి తిరుగులేని మెజారిటీ ఉంది. అయితే పెద్దల సభ రాజ్యసభలో మాత్రం ఆ పార్టీకి నానాటికి వ్యతిరేకత పెరుగుతోంది. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదం తెలిపే తీర్మానంలో మోదీ సర్కారుకు పెద్దల సభలో నిన్న గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్రపతి ప్రసంగంలో మోదీ సర్కారు గొప్పగా చెప్పుకుంటున్న నల్లధనం, అవినీతి ప్రస్తావన లేదని ఆరోపిస్తూ సీపీఎం అభ్యంతంరం తెలిపింది. తీర్మానంపై ఓటింగ్ పెట్టాల్సిందేనని పట్టుబట్టింది. సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు సీతారాం ఏచూరీ పట్టుబట్టి మరీ ఓటింగ్ పెట్టించారు. ఓటింగ్ లో తీర్మానికి అనుకూలంగా 57 ఓట్లు మాత్రమే పడ్డాయి. వ్యతిరేకంగా ఏకంగా 118 ఓట్లు పోలయ్యాయి. దీంతో పెద్దల సభలో మోదీ సర్కారుకు తీవ్ర పరాభవం ఎదురైంది.