: నల్లబెల్లం వ్యాపారితో కలిసి ఠాణాలో ఖాకీల ‘తీన్ మార్’ జల్సా... వీడియో కలకలం


నిన్న చిత్తూరు జిల్లా పీలేరు. నేడు నల్లగొండ జిల్లా ఆలేరు. పోలీసులు తప్పతాగి చిందులేశారు. ఆలేరు పోలీస్ స్టేషన్ లోని రెస్ట్ రూంలో నల్లబెల్లం వ్యాపారితో కలిసి మందు పార్టీ చేసుకున్న స్టేషన్ అధికారులు తీన్ మార్ స్టెప్పులేశారు. నాటు సారా తయారీకి వినియోగిస్తున్న నల్లబెల్లాన్ని అక్రమ మార్గాల్లో సరఫరా చేస్తూ సదరు వ్యాపారి బాగానే ఆర్జిస్తున్నాడు. తన వ్యాపారానికి సహకారం అందించాల్సిందిగా అతడు, ఆలేరు పోలీస్ స్టేషన్ అధికారులకు లంచాలు ఇచ్చాడు. అంతేకాక ఖరీదైన మద్యం బాటిళ్లతో వచ్చిన అతడితో కలిసి అధికారులు జల్సా చేశారు. అయితే అధికారుల వైఖరిపై విసుగు చెందిన ఓ కానిస్టేబుల్ సదరు జల్సా పార్టీ వీడియోను విడుదల చేశాడు. దీంతో ఈ ఘటనపై కలకలం రేగింది. పోలీసుల జల్సా పార్టీపై తెలంగాణ పోలీసు ఉన్నతాధికారులు విచారణకు ఆదేశాలు జారీ చేశారు.

  • Loading...

More Telugu News