: జర్నలిస్టుపై కోహ్లీ తిట్ల దండకం... మందలించిన రవిశాస్త్రి!


టీమిండియా వైస్ కెప్టెన్ విరాట్ కోహ్లీ, మళ్లీ తన పాత నైజాన్ని బయటపెట్టుకున్నాడు. బాలీవుడ్ నటి అనుష్క శర్మతో అతడు కొనసాగిస్తున్న ప్రేమాయణంపై మీడియాలో పలు రకాల కథనాలు వస్తున్న సంగతి తెలిసిందే. వాటిలోని ఓ కథనంతో కోహ్లీ సహనం కోల్పోయాడు. నిన్నటి ప్రాక్టీస్ సెషన్ ముగించుకుని డ్రెస్సింగ్ రూంకు వెళుతున్న క్రమంలో ఆ కథనం రాసిన విలేకరిగా భావించి ఓ జర్నలిస్టుపై తిట్ల దండకం అందుకున్నాడు. కోహ్లీ నోటి వెంట ఎలాంటి కారణం లేకుండానే బూతు పురాణం వినిపించడంతో సదరు విలేకరితో పాటు జట్టు సభ్యులు కూడా అసలేం జరిగిందో తెలియక షాక్ కు గురయ్యారట. ఆ తర్వాత తాను తిట్టిన విలేకరి, తాననుకున్న కథనాన్ని రాసిన జర్నలిస్టు కాదని తెలుసుకున్న కోహ్లీ పశ్చాత్తాపపడ్డాడట. ఈ మేరకు మరో విలేకరి ద్వారా క్షమాపణలు కోరుతూ సందేశం పంపాడట. ఈ మొత్తం వ్యవహారంపై టీమిండియా డైరెక్టర్ రవిశాస్త్రి, కోహ్లీని మందలించినట్లు సమాచారం. టీమిండియా భవిష్యత్తు కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టాల్సిన వ్యక్తి ఆగ్రహావేశాలను అదుపులో పెట్టుకోవాలని సుతిమెత్తగా మొట్టికాయలు వేశారట.

  • Loading...

More Telugu News