: ‘బడ్జెట్’పై చంద్రబాబు మంత్రాంగం... నేడు ఏపీ కేబినెట్ కీలక భేటీ!
అటు కేంద్ర బడ్జెట్ లో ఏపీకి మొండిచెయ్యే మిగిలింది. త్వరలో రాష్ట్ర బడ్జెట్ ను ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. వేధిస్తున్న ఆర్థిక లోటు. గట్టెక్కేది ఎలా? వీటన్నింటిపై ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు తన మంత్రివర్గ సహచరులతో సమాలోచనలు చేస్తున్నారు. ఇందులో భాగంగా నేటి ఉదయం ఏపీ కేబినెట్ కీలక భేటీని నిర్వహిస్తోంది. కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రం పట్ల మోదీ సర్కారు తీరుపై ఏ విధంగా వ్యవహరించాలన్న విషయంపై చంద్రబాబు ఈ భేటీలో కీలక నిర్ణయం తీసుకోనున్నారు. అంతేకాక రాష్ట్ర బడ్జెట్ లో ఆయా పథకాలకు నిధుల కేటాయింపులతో పాటు నవ్యాంధ్ర రాజధాని నిర్మాణంపైనా ఈ భేటీలో చర్చించనున్నారు.