: కళకళలాడిన రాష్ట్రం ఇప్పుడు దీనావస్థలో ఉంది: కోడెల


పచ్చగా కళకళలాడిన రాష్ట్రం ఇప్పుడు దీనావస్థలో ఉందని శాసనసభాపతి కోడెల శివప్రసాద్ తెలిపారు. గుంటూరులో ఆయన మాట్లాడుతూ, విభజన ప్రతిపాదన ప్రారంభమైన నాటి నుంచి ఆంధ్రప్రదేశ్ కు అంతటా అన్యాయమే జరిగిందని అన్నారు. ఇంత అన్యాయంగా వంచించబడిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మాత్రమేనని ఆయన చెప్పారు. మిత్రపక్షం అని రెండు కేంద్ర మంత్రి పదవులు ఇచ్చామని చెప్పడం సరికాదని ఆయన సూచించారు. 5 కోట్ల మంది ప్రజలు వంచించబడడం దారుణమని ఆయన పేర్కొన్నారు. ముఖ్యమంత్రి సహా మంత్రులంతా ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొడుతున్నా ఎలాంటి ప్రయోజనం లేకపోవడం అసహనం పెంచుతోందని ఆయన పేర్కొన్నారు. హుదూద్ తుపానుకు వెయ్యి కోట్లు ఇస్తామని ఘనంగా ప్రకటించి, ఆ పరిహారమూ ఇవ్వలేదని ఆయన ఎద్దేవా చేశారు. ఇతర సాయాల విషయంలో కూడా ఎలాంటి ప్రాధాన్యత లభించలేదని ఆయన మండిపడ్డారు.

  • Loading...

More Telugu News