: దేవుడా, వాడొక్కడ్నీ చంపేస్తా...క్షమించు!: తాప్సీ
నిర్భయ ఉదంతంతో అట్టుడికన భారతదేశం మరోసారి అలాంటి ప్రకంపనల్ని చూపిస్తోంది. నిర్భయ హత్య కేసు దోషి ముఖేష్ కుమార్ ఇంటర్వ్యూపై దేశ వ్యాప్తంగా మహిళలు నిప్పులు కక్కుతున్నారు. టాలీవుడ్ నటి తాప్సీ ఆగ్రహంగా స్పందించింది. నిజం చెప్పాలంటే, దానిని చదివిన తరువాత నాకు నోటమాటలేదు. దేవుడా! వాడొక్కడ్ని హత్య చేస్తాను, క్షమించు. నేను వీడిని సులభంగా వదిలేయలేకపోతున్నాను' అని ట్విట్టర్ లో తన ఆగ్రహం వ్యక్తం చేసింది. జైలు శిక్ష అంటే ఖైదీల్లో మార్పువస్తుందని అనుకున్నానని, అలా రానప్పుడు వాడు జైల్లో ఉండి ఫలితం ఏంటని ఆమె నిలదీసింది. ఈ శిక్ష వాడికి సరిపోలేదేమో అనే భావనతో ఆమె ప్రశ్నించింది.