: ఫోర్బ్స్ జాబితాలో నలుగురు భారతీయ మహిళలు
ఫోర్బ్స్ పత్రిక తాజాగా విడుదలచేసిన ప్రపంచ బిలియనీర్స్ జాబితాలో నలుగురు భారతీయ మహిళలు నిలిచారు. గతేడాది మహిళల జాబితాలో 172 మాత్రమే ఉంటే, ఈసారి జాబితాలో 197 మంది చోటు దక్కించుకున్నారు. అయితే, మొత్తం జాబితాలో మహిళలు 11 శాతం మాత్రమే ఉన్నారట. భారతీయుల విషయానికొస్తే, సావిత్రి జిందాల్, వారి కుటుంబం 283వ ర్యాంకు (5.3 బిలియన్ డాలర్ల నికర విలువ), ఇందూ జైన్ 603 ర్యాంకు (3.1 బిలియన్ డాలర్ల నికర విలువ), అను ఆగా 1,312 ర్యాంకు (1.5 బిలియన్ డాలర్ల నికర విలువ), కిరణ్ మజుందార్ షా 1,741 ర్యాంకుతో (1 బిలియన్ డాలర్ల నికర విలువ)తో వరుసగా ఈ జాబితాలో నిలిచారు.