: ఆల్ టైం రికార్డును తాకిన నిఫ్టీ


సెషన్ ఆరంభంలో నష్టాల్లో సాగిన స్టాక్ మార్కెట్ నెమ్మదిగా లాభాల్లోకి వెళ్లింది. ఒకదశలో నిఫ్టీ సూచీ అత్యంత కీలకమైన 9,000 పాయింట్లను దాటింది. భారత స్టాక్ మార్కెట్ చరిత్రలో నిఫ్టీ ఈ స్థాయిని తాకడం ఇదే తొలిసారి. క్యాపిటల్ గూడ్స్, హెల్త్ కేర్, బ్యాంకుల వాటాలకు కొనుగోలు మద్దతు కనిపించింది. దేశవాళీ మ్యూచువల్ ఫండ్ కంపెనీలు కొత్తగా వాటాలను కొనుగోలు చేశాయి. మంగళవారం నాటి సెషన్ ముగిసేసరికి బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్ 134.59 పాయింట్లు పెరిగి 0.46 శాతం లాభంతో 29,593.73 పాయింట్ల వద్ద, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 39.50 పాయింట్లు పెరిగి 0.44 శాతం లాభంతో 8,996.25 పాయింట్ల వద్ద స్థిరపడ్డాయి. బీఎస్ఈలో మిడ్ క్యాప్ 1.18 శాతం, స్మాల్ క్యాప్ 1.39 శాతం పెరిగాయి. టీసీఎస్, రిలయన్స్, బ్యాంక్ అఫ్ బరోడా, జిందాల్ స్టీల్, పీఎన్బీ తదితర కంపెనీలు లాభపడగా, ఎఅండ్ఎం, యాక్సిస్ బ్యాంక్, టాటా మోటార్స్, డీఎల్ఎఫ్, అంబుజా సిమెంట్స్ తదితర కంపెనీలు నష్టపోయాయి.

  • Loading...

More Telugu News