: ఇక పండగ చేసుకోండి... ఎంపీలతో మోదీ
భారతీయ జనతా పార్టీ పార్లమెంటు సభ్యులు హుషారుగా హోలీ పండుగను ప్రజలతో కలసి జరుపుకోవాలని ప్రధాని మోదీ కోరారు. పనిలోపనిగా, 125 కోట్ల మంది భారతీయులకు పార్లమెంట్ ముందుకు వచ్చిన బడ్జెట్, దానిలోని ముఖ్య విషయాల గురించి అవగాహన కల్పించాలని సూచించారు. పార్టీ సమావేశంలో భాగంగా ఎంపీలతో సమావేశమైన ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. బడ్జెట్లో భాగంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఈ సందర్భంగా మోదీ వారికి సూచించినట్లు తెలుస్తోంది.