: అనుమానం తట్టుకోలేక భర్త....ని కోసేసింది
అనుమానం పెంచుకున్న భర్త వేధింపులు తాళలేకపోయిందో భార్య. అతని వేధింపులు ఆపలేనని అర్థం చేసుకున్న ఆమె, అతనికి తగిన శాస్తి చేయాలని భావించింది. దీంతో ఏకంగా అతని మర్మాంగాన్ని కోసేసింది. దీంతో అతను చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. ఈ ఘటన హైదరాబాదులోని మెహదీపట్నం అంబేద్కర్ నగర్ లో జరిగింది. కూలీ చేసే సతీష్ (35) ప్రైవేటు ఆసుపత్రిలో హౌస్ కీపర్ గా పనిచేస్తున్న భార్య (30)పై అనుమానం పెంచుకున్నాడు. మద్యానికి బానిసై వేధించసాగాడు. గత రాత్రి కూడా మద్యం తాగి వేధించడంతో అతని మర్మాంగం కోసి, తాళం వేసుకుని పిల్లలను తీసుకుని వెళ్లిపోయింది. ఇంట్లోంచి వస్తున్న మూలుగులు విన్న స్థానికులు తాళం పగులగొట్టి చూడగా, తీవ్రరక్తస్రావంతో బాధపడుతున్న సతీష్ ను ఆసుపత్రిలో చేర్చారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు, ఆమెను అదుపులోకి తీసుకున్నారు.