: చంద్రబాబు ట్రాప్ లో పడొద్దు... పవన్ కు ఆనం వివేకానందరెడ్డి సలహా
తెలుగు సినిమా అభిమానుల్లో మంచి ప్రజాదరణ వున్న నటుడు పవన్ కల్యాణ్ ను రాజకీయంగా ఉపయోగించుకోవాలని చంద్రబాబు నాయుడు కుట్ర చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. గతంలో జయప్రద, బాబుమోహన్ వంటి సినీ ప్రముఖులను చంద్రబాబు రాజకీయంగా వాడుకుని ఆపై పట్టించుకోలేదని కాంగ్రెస్ నేత ఆనం వివేకానందరెడ్డి వ్యాఖ్యానించారు. పరిస్థితులు గమనించాలని, చంద్రబాబు ట్రాప్ లో పడొద్దని ఆనం సూచించారు. బాబు ప్రమేయం లేకుండా నేరుగా ప్రధానితో చర్చలు జరిపి రాష్ట్ర సమస్యలను పరిష్కరిస్తే పవన్ చరిత్రలో నిలిచిపోతారని అన్నారు.