: ఏరు దాటాక తెప్ప తగలేసినట్టుగా బీజేపీ వ్యవహరిస్తోంది: జేపీ


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై బీజేపీ అనుసరిస్తున్న వైఖరిపై లోక్ సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ్ మండిపడ్డారు. ప్రత్యేక హోదా తెలుగు ప్రజల హక్కు అని అన్నారు. ఏరు దాటాక తెప్ప తగలేసినట్టుగా బీజేపీ వ్యవహరిస్తోందని విమర్శించారు. అనంతపురం సప్తగిరి కూడలిలో 'తెలుగు భవిత-సంకల్ప దీక్ష' పేరిట జేపీ దీక్ష చేస్తున్నారు. విభజన సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని, రాష్ట్ర ఆర్థిక లోటును కేంద్రమే పూరించాలని డిమాండ్ చేశారు. హామీలు నెరవేర్చకుంటే ఏపీ భవిష్యత్ అంధకారంగా మారుతుందని చెప్పారు. లక్షలాదిమంది యువత నిరుద్యోగులుగా మారతారని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, ఆర్థిక లోటు భర్తీ, పరిశ్రమల స్థాపన నెరవేర్చాలని జేపీ కోరారు. ఈ నెల 5న విశాఖలో, 8న విజయవాడలో జేపీ దీక్ష చేయనున్నారు.

  • Loading...

More Telugu News